TATA Steel: భూషణ్ స్టీల్ అనుబంధ సంస్థ అయిన భూషణ్ ఎనర్జీని కొనుగోలు చేసిన టాటా స్టీల్

  • కొనుగోలు పూర్తి చేసినట్టు తెలిపిన టాటా స్టీల్
  • సెబీ నిబంధనలను పూర్తిగా పాటించామని వెల్లడి
  • ఎన్‌సీఎల్‌టీ ఆమోద ముద్ర అనంతరం ప్రకటన

ఇప్పటికే భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేసిన టాటా స్టీల్ తాజాగా భూషణ్ ఎనర్జీని కూడా కొనుగోలు చేసింది. భూషణ్ స్టీల్‌కు అనుబంధ సంస్థే భూషణ్ ఎనర్జీ. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ రూ.800 కోట్ల బిడ్‌కు ఆమోద ముద్ర వేసిన అనంతరం టాటా స్టీల్ ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ‘భూషణ్ ఎనర్జీ లిమిటెడ్‌ను టాటా స్టీల్ బీఎస్ఎల్ విజయవంతంగా కొనుగోలు పూర్తి చేసింది. సెబీ నిబంధనలను పూర్తిగా పాటించి ఈ కొనుగోలును పూర్తి చేశాం’ అని టాటా స్టీల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News