Andhra Pradesh: ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం

  • విజయనగరం జిల్లాలో పిడుగులు
  • ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులు
  • భయాందోళనలో ప్రజలు
ఏపీలో ఇవాళ సాయంత్రం పలుచోట్ల అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, పిడుగులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కిమిడిభద్రలో పిడుగులు పడి ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పుల్లలచెరువు మండలంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మండలంలోని గాజులపాలెంలో ఈదురుగాలులు ప్రజలను భయకంపితుల్ని చేశాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 
Andhra Pradesh
Vizag
Prakasam District

More Telugu News