Andhra Pradesh: విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు.. టూర్ వివరాలు ఇవే!

  • ఈ నెల 7 నుండి 14 వరకూ పర్యటన
  • కుటుంబంతో సహా పయనం
  • పర్యటన అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7న చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశాలకు ప్రయాణం కానున్నారు.

అనంతరం జూన్ 14న తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. అనంతరం అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో టీడీపీని బలోపేతం చేయడంపై చంద్రబాబు చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News