Andhra Pradesh: పోసాని కృష్ణమురళీకి అనారోగ్యం.. పరామర్శించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి!

  • యశోద ఆసుపత్రిలో పోసానికి చికిత్స
  • వైద్యులతో మాట్లాడిన వైసీపీ నేతలు
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల
ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు పోసాని క‌ృష్ణమురళీ హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు పోసానిని పరామర్శించారు.

ఇతర వైసీపీ నేతలతో కలిసి యశోదా ఆసుపత్రికి వెళ్లిన సజ్జల పోసాని ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Andhra Pradesh
Posani Krishna Murali
hospital
sick
treatment
YSRCP
Jagan
sajjala

More Telugu News