Jagan: రూ. 39,815 కోట్లు కావాలి... లేకుంటే గట్టెక్కలేమని జగన్ కు స్పష్టం చేసిన అధికారులు!

  • ఆదాయం పెంచే మార్గాలను సృష్టించుకోవాలి
  • కేంద్రం నుంచి 60 శాతమే సాయం
  • జగన్ కు రిపోర్ట్ ఇచ్చిన ఆర్థిక శాఖ అధికారులు

మరో సంవత్సరం పాటు రాష్ట్రం నడవాలంటే కనీసం రూ. 39,815 కోట్లు అవసరమని ఏపీ సీఎం జగన్ కు ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఇంత డబ్బును ఖజానాకు చేర్చేందుకు ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించిన సంగతి తెలిసిందే.

మిగతా కాలానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులను అంచనాలు వేసిన అధికారులు, జగన్‌ కొత్తగా  ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు కావలసిన రూ.6,265 కోట్లతో కలిపి అదనంగా దాదాపు 40 వేల కోట్లను సమకూర్చుకుంటేనే సజావుగా పాలన సాగుతుందని తేల్చారు.  తాజా అంచనాల ప్రకారం ఖర్చు రూ. 238793 కోట్లు, ఆదాయం రూ. 1,98,977 కోట్లు ఉంటుందని అధికారులు జగన్ కు నివేదించారు.

ఇక ఈ మొత్తం రెవెన్యూ లోటులో రూ. 17,500 కోట్ల వరకూ పూడ్చుకునే అవకాశం ఉందని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. కేంద్రం నుంచి రెవెన్యూ గ్రాంట్ గా రూ. 10 వేల కోట్లను పొందాలని, ఇసుకపై సీనరేజ్ విధించడం ద్వారా రూ. 2 వేల కోట్లు, నీటి పన్ను వసూలు ద్వారా రూ. 500 కోట్లు అదనంగా తేవచ్చని, రాష్ట్ర ఆదాయాన్ని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా  మరో రూ. 5 వేల కోట్లను ఆదా చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

More Telugu News