Konijeti Rosaiah: గవర్నర్ ఇఫ్తార్ విందుకు హాజరైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

  • మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరు
  • ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు
  • సందడిగా మారిన రాజ్‌భవన్
రంజాన్‌ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరయ్యారు. వీరితో పాటు తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు విందుకు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాల ప్రముఖులు విందుకు హాజరవడంతో రాజ్‌భవన్‌లోని సంస్కృతి మందిరం సందడిగా మారింది.
Konijeti Rosaiah
Mahamood Ali
Etela Rajender
KCR
Jagan
Vijayasai Reddy

More Telugu News