opposition: ప్రతిపక్ష హోదాను మేము కోరుకోవడం లేదు: కాంగ్రెస్

  • మాకు 52 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు
  • హోదా పొందేందుకు మరో ఇద్దరు ఎంపీలు కావాలి
  • తగిన బలం ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకులమని చెప్పుకుంటాం

కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్ష హోదాను తాము కోరుకోవడం లేదని ప్రకటించింది. లోక్ సభలో తమకు 52 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని... ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించాలంటే మరో ఇద్దరు ఎంపీలు కావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. తమ వద్ద తగినంత సంఖ్యాబలం ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకులమని చెప్పుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ను అధికారికంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించాలా? వద్దా? అనే విషయాన్ని అధికారపక్షమే నిర్ణయిస్తుందని చెప్పారు. లోక్ సభలో ప్రతిపక్ష పార్టీగా అర్హత పొందడానికి 54 మంది ఎంపీలు ఉండాలి. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఇది వరుసగా రెండోసారి.

  • Loading...

More Telugu News