Andhra Pradesh: బెల్టు షాపులను ఎత్తివేయండి.. అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం!

  • సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడ్డాం
  • దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తాం
  • ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అధికారులకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆర్థిక, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్, వేర్వేరు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎన్నికల హామీ మేరకు ఏపీలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని పునరుద్ఘాటించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
belt shops closed
order

More Telugu News