మద్య నిషేధంపై కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. ఏటా 20శాతం మద్యం షాపుల ఎత్తివేత!
- దశల వారీగా మద్యం షాపుల ఎత్తివేత
- ఐదేళ్లలో పూర్తిగా మద్యం దుకాణాలు బంద్
- లైసెన్స్, మద్యం రేట్లను భారీగా పెంచాలని నిర్ణయం?
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. వీటిని ఒకేసారి రద్దు చేయకుండా ఏడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్య నిషేధం హామీ అమలు చేసినట్టు అవుతుందని భావిస్తోంది.
మద్య దుకాణాలను ఎత్తివేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని వేరే మార్గాల్లో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడం వంటివాటిపై కసరత్తు చేస్తోంది. మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల తాగే వారి సంఖ్య తగ్గుతుందని, ఆ రకంగా కూడా మద్య నిషేధం కొంత వరకు అమలు అవుతుందని అంచనా వేస్తోంది.