Chandrababu: హైదరాబాదులో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు!

  • నిన్న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు
  • పరగడుపునే ఆసుపత్రికి
  • గంటకు పైగా వైద్య పరీక్షలు
అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు, వైద్య పరీక్షల నిమిత్తం ఏషియన్ గాస్ట్రోలజి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఉదయం పరగడపునే బాబు ఆసుపత్రికి చేరుకోగా, దాదాపు గంటకు పైగా వైద్య పరీక్షలు జరిగాయని సమాచారం. చెకప్ అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి ఆయన చేరుకోగా, పలువురు పార్టీ నేతలు ఆయన్ను కలిశారు. సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆయనతో భేటీ అయ్యారు. వీరి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరికాసేపట్లో చంద్రబాబుతో భేటీపై జేసీ మీడియాతో మాట్లాడతారని సమాచారం.
Chandrababu
Medicle Checkups
JC
L Ramana

More Telugu News