assembly: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?...కొలువుదీరనున్న నవ్యాంధ్ర ద్వితీయ సభ

  • ఆ మేరకు చంద్రబాబు షెడ్యూల్‌ ఖరారైనట్టు సమాచారం
  • తొలుత పార్టీ ఓటమిపై నియోజకవర్గాల సమీక్ష
  • ఆ తర్వాత విదేశీ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూన్ 11వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నవ్యాంధ్ర ద్వితీయ సభ 11న కొలువు దీరే అవకాశం ఉండడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మేరకు షెడ్యూల్‌ సిద్ధం చేసుకున్నారని సమాచారం. తొలుత పార్టీ ఓటమిపై పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష, అనంతరం విదేశీ ప్రయాణం పూర్తి చేసుకుని అసెంబ్లీ సమావేశాల సమయానికి కచ్చితంగా హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవంలో పాల్గొనేందుకు ఈనెల 28న గుంటూరు విచ్చేసిన చంద్రబాబు ఈరోజు తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. జూన్‌ 4 నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో అప్పటికి మళ్లీ విజయవాడ చేరుకుంటారు. మూడు రోజులపాటు ఈ సమీక్షలు జరుగుతాయి. ఆరో తేదీన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఆయన ఏ దేశం వెళుతున్నదీ బయటపెట్టడం లేదు. పర్యటన పూర్తికాగానే తొలుత ఆయన హైదరాబాద్‌ చేరుకుని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి విజయవాడ చేరుకుంటారని సమాచారం.

More Telugu News