Nirav Modi: నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారో చెప్పండి... భారత ప్రభుత్వాన్ని కోరిన యూకే కోర్టు

  • భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి
  • లండన్ లో తలదాచుకున్న వైనం
  • జూన్ 27కి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం

పంజాన్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసును యూకే కోర్టు జూన్ 27కి వాయిదా వేసింది. నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే విషయమై లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా, నీరవ్ మోదీని అప్పగిస్తే అతడిని ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ న్యాయస్థానం భారత్ ను కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి 14 రోజుల గడువు విధించింది. కాగా, భారత వర్గాలు నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తితో చెప్పినట్టు సమాచారం.

More Telugu News