Cricket: వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ లో సఫారీల ఎదురీత

  • ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కష్టాల్లో దక్షిణాఫ్రికా
  • 144 పరుగులకే 5 వికెట్లు ఔట్
  • ఆర్చర్ కు 2 వికెట్లు

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఓవల్ మైదానంలో 312 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేశారు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ క్వింటన్ డికాక్ 68 పరుగులు చేసి అవుటయ్యాడు. కొత్త బ్యాట్స్ మన్ వాన్ డెర్ డుస్సెన్ 42 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు.

ఆమ్లా 5 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ కాగా, మర్ క్రమ్, డుప్లెసిస్ డుమినీ తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం డుస్సెన్ కు తోడుగా ప్రిటోరియస్ క్రీజులో ఉన్నాడు ఈ మ్యాచ్ లో గెలవాలంటే సఫారీలు 23 ఓవర్లలో 166 పరుగులు చేయాలి.

More Telugu News