రేపు ఢిల్లీలో విపక్షాల ఆత్మపరిశీలన
- పార్లమెంటు హాలులో భేటీకి నిర్ణయం
- ఎన్నికల్లో ఓటమిపై ఉమ్మడి చర్చ
- ఫలితాల తర్వాత తొలిసారి సమావేశం
మరోసారి ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి ఈ భేటీలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. ఫలితాల సందర్భంగా ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య తేడా వచ్చిందన్న విషయాన్ని విపక్షాలు చర్చించనున్నాయి. కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టతరాలేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబే ముందు నిలబడి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.