Jagan: నామినేషన్ వేసినప్పటి నుంచి.. హుద్ హుద్ తుపాన్‌ను మించి గాలి వీచింది: ఎమ్మెల్యే వాసుబాబు

  • 150 సీట్లు వస్తాయని ఆయన ముందే చెప్పారు
  • దేవుడు ఒక సీటు ఎక్కువే ఇచ్చాడు
  • జగన్ కష్టానికి ప్రతిఫలం లభించింది
నామినేషన్ వేసినప్పటి నుంచి.. హుద్ హుద్ తుపాన్‌ను మించి గాలి వీచిందని ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు తెలిపారు. నేడు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీకి 150 సీట్లు వస్తాయని ఆయన ముందే చెప్పారని, కానీ ఆ దేవుడు ఒక సీటు ఎక్కువే ఇచ్చాడన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది వైసీపీ ఎంపీలను గెలిపించి రాష్ట్ర ప్రజలు జగన్‌కు కానుకగా ఇచ్చారని వాసుబాబు పేర్కొన్నారు. జగన్ కష్టానికి ప్రతిఫలం లభించిందని, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 
Jagan
Vasubabu
Hudhud
Uppal
Andhra Pradesh
Ungaturu

More Telugu News