kishan reddy: మోదీ ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నా: కిషన్ రెడ్డి

  • కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి స్థానం
  • అమిత్ షా నుంచి వెళ్లిన ఫోన్ కాల్
  • 7 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖరారయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ప్రజలు, ప్రధాని మోదీ ఆశీస్సులతో ఈ రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని ఆయన తెలిపారు. మీ అందరి మద్దతు ఇకపై కూడా తనకు ఇలాగే ఉండాలని ప్రజలకు విన్నవించారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తున్నట్టు కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంకాలం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. 
kishan reddy
union minister
oath

More Telugu News