Jagan: పెనుగాలులతో భారీ వర్షం... విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు అంతరాయం!

  • మరికొన్ని గంటల్లో జగన్ ప్రమాణం
  • బుధవారం పెనుగాలులతో భారీ వర్షం
  • యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో కురిసిన భారీ వర్షం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లకు కొంత అడ్డంకిగా మారింది. నిన్న రాత్రి పెనుగాలులతో భారీ వర్షం కురవడంతో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లు దెబ్బతిన్నాయి. పుష్పాలంకరణ కొంత దెబ్బతింది. పెనుగాలుల వల్ల వేదిక వద్ద కొన్ని టెంట్లు కూలిపోయాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన వీటిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఉదయం 9 గంటలకల్లా స్టేడియాన్ని సిద్ధం చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News