Mahesh Babu: మహేశ్ బాబు సినిమాకి నిర్మాతగా కొరటాల శివ?

  • మహేశ్ 26వ సినిమాకి సన్నాహాలు 
  • తదుపరి సినిమా పరశురామ్ తో 
  • కొరటాలను కూడా లైన్లో పెట్టేసిన మహేశ్    

మహేశ్ బాబు 26వ సినిమా .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహేశ్ బాబు తన 27వ సినిమాను కూడా లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం పరశురామ్ ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి కొరటాల శివ ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరొక విశేషమేమిటంటే, పరశురామ్ ప్రాజెక్టు తరువాత కొరటాల శివతోనే కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. అంటే ముందు నిర్మాతగా .. ఆ తరువాత దర్శకుడిగా మహేశ్ బాబు కాంబినేషన్లో కొరటాల శివ సినిమాలు రానున్నాయన్న మాట.

More Telugu News