karthikeya: కార్తికేయ 'హిప్పీ' విడుదల తేదీ ఖరారు

  • కార్తికేయ నుంచి 'హిప్పీ'
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
  • జూన్ 6వ తేదీన విడుదల    

కార్తికేయ కథానాయకుడిగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో 'హిప్పీ' రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా దిగాంగన నటించింది. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, 'ఎ' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తమిళంలోను తన క్రేజ్ ను .. మార్కెట్ ను పెంచుకోవచ్చనే ఆలోచనలో కార్తికేయ వున్నాడట. 'ఆర్ ఎక్స్ 100' తరువాత ఈ సినిమా వస్తుండటంతో, భారీ అంచనాలు వున్నాయి.

More Telugu News