modi: ఇమ్రాన్ ఖాన్ కు ఆహ్వానం పంపని మోదీ

  • గత ప్రమాణస్వీకారానికి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన మోదీ
  • బిమ్ స్టెక్ దేశాధినేతలకు ఆహ్వానం
  • దాదాపు 6,500 మంది అతిథులు హాజరవుతున్నట్టు సమాచారం

2014లో ప్రధానిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మోదీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోదీ నుంచి ఆహ్వానం వెళ్లలేదు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా బిమ్ స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిమ్ స్టెక్ దేశాధినేతలు హాజరుకానుండటం ఇదే ప్రథమం. బిమ్ స్టెక్ కూటమిలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు ఉన్నాయి. బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం ఈ కూటమి ఏర్పాటయింది. మరోవైపు, మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు 6,500 మంది అతిథులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News