Andhra Pradesh: జగన్ ప్రమాణస్వీకారానికి జోరుగా ఏర్పాట్లు.. డ్రోన్ తో తీసిన వీడియో వైరల్!

  • విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమం
  • రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం
  • హాజరు కానున్న పలువురు రాజకీయ ప్రముఖులు
వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ రేపు విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జగన్ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

కాగా, జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. నేటి రాత్రికి ఏర్పాట్లన్నీ పూర్తి అవుతాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ముఖ్యనేతలు, అధికారులు ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తాజాగా స్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లకు సంబంధించి డ్రోన్ తో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని మీరూ చూసేయండి.
Andhra Pradesh
Jagan
YSRCP
Vijayawada
indira gandhi stadium
drone video

More Telugu News