Prakasam District: జూబ్లీహిల్స్ లో సినీ కార్మికుడి హత్య

  • షూటింగ్ ముగించుకుని వస్తుండగా దుండగుల దాడి
  • మృతుడిది ప్రకాశం జిల్లా
  • 15 రోజుల క్రితమే పనిలో చేరిన వైనం
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ సినీ కార్మికుడు హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని వస్తున్న వెంకటేశ్ అనే సినీ కార్మికుడ్ని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. మృతుడు వెంకటేశ్ ది ప్రకాశం జిల్లా. 15 రోజుల క్రితమే అతను సినీ రంగంలో ఉపాధి దొరకడంతో హైదరాబాద్ వచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది పోకిరీల పనే అయ్యుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Prakasam District
Hyderabad

More Telugu News