Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నవీన్‌ పట్నాయక్‌

  • జ్యోతిబసు, పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ సరసన చేరిన నవీన్‌
  • సార్వత్రిక ఎన్నికల్లో బిజూ జనతా దళ్‌ ఘన విజయం
  • భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో కార్యక్రమం
ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతా దళ్‌ (బీజేడీ) అధినేత నవీన్‌పట్నాయక్‌ ఐదోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 21 మంది మంత్రులు ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ గణేశీలాల్‌ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి దేశంలో వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన జ్యోతిబసు, పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ సరసన నవీన్‌ పట్నాయక్‌ చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 147 స్థానాలున్న ఒడిశా శాసన సభలో 112 చోట్ల విజయదుందుభి మోగించి బీజేడీ మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశమంతా బీజేపీ పవనాలు వీచినా ఒడిశాలో ఆ ప్రభావం అంతగా కనిపించ లేదు. 21 లోక్‌ సభ స్థానాలకు గాను 12 చోట్ల విజయం సాధించి బీజేడీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది.
Odisha
naveen patnayak
fifth term CM

More Telugu News