శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ

29-05-2019 Wed 12:10
  • శివకృష్ణ నిర్మించిన చిత్రం 'ఆడది'
  • 'కర్తవ్యం' రోజునే 'ఆడది' విడుదల
  •  'ఆడది' ఆశించిన ఫలితం పొందలేదు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో యమున నటించిన 'ఆడది' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'మౌనపోరాటం' తరువాత యమున చేసిన మరో గొప్ప చిత్రం 'ఆడది'. శివకృష్ణ ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు.

అయితే, విజయశాంతి ప్రధానపాత్రధారిగా చేసిన 'కర్తవ్యం' విడుదలయ్యే రోజునే 'ఆడది'ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 'కర్తవ్యం' సినిమా తప్పకుండా హిట్ అవుతుంది .. ఒకవారం గ్యాప్ తీసుకుని అప్పుడు 'ఆడది' విడుదల చేయమని నేను శివకృష్ణకి చెప్పాను. ఈ రెండు సినిమాలకి దర్శకుడు మోహన్ గాంధీ గారు .. ఆయనతోను ఇదే మాట చెప్పాను. ఇద్దరూ వినిపించుకోలేదు .. దాంతో 'ఆడది' ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయింది" అని చెప్పుకొచ్చారు.