Yatra: రాజారెడ్డి, జగన్ లేకుండా వైఎస్ లేరు... 'యాత్ర' రెండో భాగం తీస్తున్నానన్న మహి వీ రాఘవ!

  • మమ్ముట్టి హీరోగా 'యాత్ర'
  • రెండో భాగంలో రాజారెడ్డి, జగన్ అనుబంధం
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మహీ వీ రాఘవ

ఇటీవల మమ్ముట్టి హీరోగా వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ 'యాత్ర'ను తీసి విజయం సాధించిన దర్శకుడు మహీ వీ రాఘవ, ఇప్పుడు 'యాత్ర-2' తీసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వైఎస్ఆర్ కథ రాజారెడ్డి, జగన్ లేకుండా అసంపూర్తేనని వ్యాఖ్యానించిన ఆయన, 'యాత్ర-2' కథలో వీరిద్దరివే ప్రముఖ పాత్రలని చెప్పారు. 'యాత్ర' సినిమాను వైఎస్ జగన్ ను చూపిస్తూ ముగించడానికి కారణం కూడా ఇదేనని, ఆ చిత్రంలో తామెక్కడ సినిమాను ముగించామో, అక్కడి నుంచి కొత్త సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. వైఎస్ స్ఫూర్తితో జగన్ వేసిన అడుగులతో ఈ చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News