Ramgopal Varma: ఈ ఉదయం తిరుమలలో రామ్ గోపాల్ వర్మ... జగన్ కు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చూపిస్తానని ప్రకటన!

  • ఈ ఉదయం తిరుమలలో స్వామి దర్శనం
  • ప్రమాణ స్వీకారం కాగానే ప్రత్యేక ప్రదర్శన
  • వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ
 నవ్యాంధ్ర కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోగా, ఆయనతో పాటు పలువురు గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు, నాయకులు తరలివచ్చారు. వారితో పాటు వచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సంప్రదాయ దుస్తుల్లో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెలుపలికి వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ కు తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని చూపిస్తానని చెప్పారు. తన కొత్త చిత్రం విడుదల సందర్భంగానే స్వామిని దర్శించుకున్నానని, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రత్యేకంగా చిత్రాన్ని ఆయనకు చూపిస్తానని అన్నారు. సినిమాను తానిప్పుడు ప్రమోషన్ చేస్తున్నానని అన్నారు.
Ramgopal Varma
Lakshmis NTR
Tirumala
Jagan

More Telugu News