Jagtial District: భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం

  • హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తజనసంద్రం
  • భారీగా తరలివచ్చిన ఆంజనేయస్వామి దీక్షాధారులు
  • అర్ధరాత్రి నుంచే కిక్కిరిసిపోయిన ఆలయం
హనుమాన్‌ జయంతి సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి మంగళవారం అర్ధరాత్రికే భక్తులు, దీక్షాధారులు ఆలయానికి పోటెత్తారు. జయంతికి ముందు హనుమాన్‌ దీక్ష చేపట్టిన దీక్షాధారులు ఇరుముడులతో తరలివచ్చి స్వామికి మొక్కులు తీర్చుకుని దీక్ష విరమణ చేశారు.

రామనామ స్మరణతతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఇసుకవేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి భక్తులు ఒక్కసారిగా రావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.
Jagtial District
kondagudi
hanuman jayanthi

More Telugu News