Jagan: జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళతారా?

  • రేపు జగన్ ప్రమాణ స్వీకారోత్సవం
  • స్వయంగా చంద్రబాబును ఆహ్వానించిన జగన్
  • 2014లో చంద్రబాబు ప్రమాణానికి హాజరుకాని జగన్

రేపు ఉదయం నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే నేత స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు కూడా. అయితే, ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళతారా? లేదా? అన్న విషయంపై మాత్రం ఇంతవరకూ స్పష్టత లేదు. కాగా, 2014లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేళ, జగన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సస్పెన్స్ నెలకొనివుంది.

  • Loading...

More Telugu News