Hyderabad: హైదరాబాదులో బయో డీజిల్ డీలర్ షిప్ ల పేరిట భారీ మోసం!

  • ‘మై ఓన్ ఎకో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మోసం
  • ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
  • సుమారు రూ.కోటి మేరకు మోసం  
హైదరాబాద్ లో బయోడీజిల్ డీలర్ షిప్ పేరిట భారీ మోసం జరిగింది. ‘మై ఓన్ ఎకో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరిట నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. ఈ సంస్థ ఎండీ సంతోష్ వర్మ, ఆ సంస్థకు చెందిన వ్యక్తి సారికా షిండే ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పలువురిని నిందితులు మోసం చేశారు. డీలర్ షిప్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల వరకూ నిందితులు వసూలు చేశారని, సుమారు కోటి రూపాయల మేరకు మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad
bio diesel
dealership
ccs
police

More Telugu News