KCR: కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు: రేవంత్ రెడ్డి

  • పార్టీ మారుతున్న ప్రచారంలో నిజం లేదు
  • రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
  • రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తా
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన రేవంత్‌ను నేడు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాహుల్ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తానని రేవంత్ పేర్కొన్నారు.
KCR
Loksabha
Congress
Revanth Reddy
Rahul Gandhi
CPI

More Telugu News