Deva: భార్యాభర్తల మధ్య గొడవ.. మామ హత్య!

  • కుమార్తెను దేవాకు ఇచ్చి వివాహం చేసిన సోముల
  • ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు
  • కూతురుని తన ఇంటికి తీసుకొచ్చిన సోముల

భార్యాభర్తల మధ్య ఘర్షణ మామ మృతికి కారణమైన ఘటన సోమవారం అర్థరాత్రి జనగామ జిల్లా కడగుట్టతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కడగుట్టతండాకు చెందిన ధారవత్ సోముల(48) తన కుమార్తె మంజులను దేవరుప్పల మండలం ధర్మాపురం గ్రామానికి  చెందిన బానోతు దేవాకు ఇచ్చి వివాహం చేశాడు. అయితే దేవా, మంజుల మధ్య ఆరు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మంజులను సోముల తమ గ్రామానికి తీసుకు వచ్చేశాడు. ఈ క్రమంలో దేవా కూడా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో తన తల్లిదండ్రులతో సోముల ఇంటికి వచ్చాడు. అంతా మాట్లాడుకునే క్రమంలో ఆగ్రహానికి లోనైన దేవా, సోములను కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సోముల కుమారుడు రణదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.  

  • Loading...

More Telugu News