rajani: నెహ్రూ తరువాత అంతటి ప్రజాకర్షణ నేత మోదీనే!: రజనీకాంత్

  • మోదీ చాలా శక్తిమంతమైన నేత
  • ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతున్నాను 
  • రాహుల్ తన సమర్థతను నిరూపించుకోవాలన్న సూపర్ స్టార్  
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించింది. ఈ నెల 30వ తేదీన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా రజనీకాంత్ .. కమలహాసన్ లతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

ఈ ఆహ్వానంపై రజనీ స్పందిస్తూ "ఇది మోదీ సాధించిన విజయం .. జవహర్ లాల్ నెహ్రూ అనంతరం అంతటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు మోదీనే. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి నేను వెళుతున్నాను" అని చెప్పారు.

ఇదే సందర్భంలో ఆయన రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నాడనే ప్రచారంపై స్పందిస్తూ "రాహుల్ గాంధీ రాజీనామా చేయకూడదు .. ఆయన తన సమర్ధతను నిరూపించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి" అన్నారు.  
rajani
rahul

More Telugu News