Rahul gandhi: జగన్ ప్రమాణస్వీకారానికి రానున్న స్టాలిన్

  • ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్
  • హాజరుకానున్న డీఎంకే అధినేత స్టాలిన్, సీఎం కేసీఆర్ 
  • రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న స్టాలిన్

ఈ నెల 30న ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి డీఎంకే అధినేత స్టాలిన్ కూడా వస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని స్టాలిన్ దర్శించుకోనున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు.   ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. ఈ విషయమై రాహుల్ కు   ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న రాహుల్ నిర్ణయం గురించి ప్రస్తావించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా స్టాలిన్ మాట్లాడినట్టు డీఎంకే వర్గాల సమాచారం.

More Telugu News