Vijayawada: నేను ఒకప్పుడు ఉన్న గది ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ గా మారింది!: రామ్ గోపాల్ వర్మ

  • చదువుకునే రోజుల్లో బెజవాడలో అద్దెకున్న వర్మ
  • సిద్ధార్థ కాలేజీ హాస్టల్ వెనుక ఓ గదిలో ఉన్నా
  • ఆ గదిలో గోడకు నటి శ్రీదేవి పోస్టర్ ను అతికించేవాడిని

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. విజయవాడలో తాను చదువుకునే రోజుల్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వెనుక ఉన్న ఓ గదిలో అద్దెకు ఉండేవాడినని చెబుతూ వర్మ ఓ పోస్ట్ చేశారు. ఈ గదిలో రెండేళ్లకు పైబడి తాను అద్దెకు ఉన్నానని, ఇప్పుడు ఆ గది ఉమెన్స్ హాస్టల్ గా మారిందని చెప్పారు. ప్రస్తుతం ఆ గదిలో ఉంటున్న అమ్మాయిలతో కలిసి తాను దిగిన ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. తన వెనుక ఉన్న గోడకే నటి శ్రీదేవి పోస్టర్ ను అతికించే వాడినని వర్మ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

More Telugu News