Putta Sudhakar Yadav: రాజీనామాకు టీటీడీ చైర్మన్ ససేమిరా... దమ్ముంటే బోర్డును రద్దు చేసుకోవాలని సవాల్!

  • స్వచ్ఛందంగా మాత్రం రాజీనామా చేయబోను
  • అధికారులు సమావేశానికి హాజరు కాలేదు
  • ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తేనే పదవిని వీడుతా
  • స్పష్టం చేసిన పుట్టా సుధాకర్ యాదవ్
టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ససేమిరా అంటున్నారు. తాను రాజీనామా చేయబోనని, దమ్ముంటే బోర్డును ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని అన్నారు. ఈ ఉదయం టీటీడీ బోర్డు సమావేశం కావాలని ముందే నిర్ణయించామని, కానీ అధికారులు హాజరుకాలేదని విమర్శించిన ఆయన, ఎవరు రాజీనామా చేసినా తాను మాత్రం చేయనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తమను నియమించిందని, తాము బోర్డులోకి వచ్చామని, తమ పదవీ కాలం ఇంకా ఉందని ఈ సందర్భంగా పుట్టా గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే తాను పదవిని వీడుతానని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా బోర్డును వీడేందుకు అత్యధిక సభ్యులు సుముఖంగా లేరని తెలిపారు.
Putta Sudhakar Yadav
Resign
TTD
Board

More Telugu News