Guntur District: మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా.. అక్కడి వారికి అండగా ఉంటా: నారా లోకేశ్

  • ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం
  • ఏ కష్టమొచ్చినా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా
  • తనను కలిసిన కార్యకర్తలు, అభిమానులతో లోకేశ్  

విజయవాడలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, ఎప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తాను పోటీ చేస్తున్నప్పుడే ‘రాంగ్ సెలక్షన్’ అని అన్నారని, ఓడిపోయిన తర్వాత కూడా అదే మాట అంటున్నారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశానని, తాను ఓడిపోయినప్పటికీ ఈ ప్రణాళికల అమలుకు ప్రయత్నిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని లోకేశ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News