cuddapah: రేపు ఉదయం ఇడుపులపాయకు జగన్

  • తన తండ్రి వైఎస్ కు నివాళులర్పించనున్న జగన్
  • రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లనున్న వైసీపీ అధినేత
  • ఎల్లుండి తిరుమల శ్రీవారి దర్శనం
వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మాజీ సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అక్కడ నివాళులు అర్పించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకుని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారని పార్టీ వర్గాల సమాచారం. అనంతరం, పులివెందుల నుంచి రేపు సాయంత్రం జగన్ తిరుమలకు వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారని తెలుస్తోంది. ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని సంబంధిత వర్గాల సమాచారం.
cuddapah
idupulapaya
YSRCP
jagan

More Telugu News