Andhra Pradesh: ఏపీలో విడుదల చేసే శ్వేతపత్రాలతో వాస్తవాలు బయటకొస్తాయి: సోము వీర్రాజు

  • ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు బయటకొస్తాయి
  • కేంద్ర నిధులను వినియోగించడంలో చంద్రబాబు విఫలం
  • ఇన్నాళ్లూ ఈ వివరాలు బయటకురాకుండా బాబు తొక్కిపెట్టారు

ఏపీలో కొత్త ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలతో వాస్తవాలు బయటకు రానున్నాయని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్లలో కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు ఈ శ్వేత పత్రాల ద్వారా బయటకొస్తాయని అన్నారు. ఇన్నాళ్లూ కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల గురించిన వాస్తవాలు బయటకు రాకుండా చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు. శ్రీకాకుళం మినహాయించి, ప్రతి జిల్లాకు కేంద్ర సాయాన్ని, కేంద్ర నిధులను వినియోగించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News