West Bengal: కారు, అంబులెన్స్‌ ఢీ... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం

  • తీవ్రంగా గాయపడిన మరో బాలుడి పరిస్థితి విషమం
  • బాధితులు పశ్చిమబెంగాల్‌ వాసులుగా గుర్తింపు
  • అతివేగం వల్లే ప్రమాదం జరిగిందన్న భావన
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు యెలహంకలోని కౌగిలు క్రాస్‌ వద్ద అతివేగంగా వస్తున్న కారు, అంబులెన్స్‌లు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులను పశ్చిమబెంగాల్‌ కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు.  దీపక్‌, సంజయ్‌ కుటుంబాలు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
West Bengal
Karnataka
Road Accident
five died

More Telugu News