Jagan: గవర్నర్ కు అందిన గెలిచిన అభ్యర్థుల జాబితా.. వెంటనే గెజిట్!

  • గవర్నర్ కు జాబితాను అందించిన ద్వివేది
  • ఆ వెంటనే గెజిట్ ప్రచురణ
  • ఒక్కొక్కటిగా పూర్తవుతున్న లాంఛనాలు
ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ఎస్‌కే రుడోలాలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్‌ నరసింహన్‌ కు అందించారు.  ఆ వెంటనే ఆ వివరాలన్నింటితో గెజిట్ ముద్రితమైంది. కొత్త శాసన సభ్యుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించడంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు అధికారిక లాంఛనాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. తమ అధినేత జగన్‌ ను శాసన సభాపక్ష నేతగా వైసీపీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
Jagan
Governer
ESL Narasimhan
Andhra Pradesh

More Telugu News