Summer: నిప్పులు కురిపిస్తున్న భానుడు... ఉదయం 8 గంటలకే భగభగలు!

  • వడగాలులతో బెంబేలెత్తుతున్న ప్రజలు
  • అర్ధరాత్రి దాటినా తగ్గని వడగాలులు
  • కరెంట్ కు ఎన్నడూ లేనంత డిమాండ్
తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి భగభగలు ప్రజలను తీవ్ర ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి దాటినా తగ్గని వేడిగాలులతో నిద్రలేక విలవిల్లాడుతున్నారు. కరెంట్ కు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది.

వాయవ్య దిశ నుంచి వీస్తున్న వడగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. తేమ శాతంలో మార్పుల కారణంగానే నిప్పులగుండంగా రాష్ట్రం మారింది. మరో మూడు రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకూ సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు ప్రవేశించిన తరువాతే సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేశారు.
Summer
Heat
IMD
Sun

More Telugu News