New Delhi: గెలిచిన వెంటనే మీకేమనిపించింది?: జగన్ కు 'ఇండియా టుడే' రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రశ్న

  • న్యూఢిల్లీలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్
  • గెలిచిన వెంటనే నాన్నను తలచుకున్నాను
  • అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలన్న జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఆపై తొలిసారిగా న్యూఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్ ను, 'ఇండియా టుడే' ప్రతినిధి రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేయగా, జగన్ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.  ఘన విజయం తరువాత మీకేమనిపించింది?' అన్న ప్రశ్నకు జగన్ సమాధానం ఇస్తూ, "ఇంతటి అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా నాన్నను తలుచుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు" అని సమాధానం ఇచ్చారు.

 కాంగ్రెస్ అధిష్ఠానం తన తప్పు తెలుసుకుని, మిమ్మల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు, "నా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలని నేను అనుకోవడం లేదు. దేవుడే వారికి శిక్ష వేస్తాడు" అని అన్నారు. తనకు సంబంధించినంత వరకూ, కాంగ్రెస్ ను ఎప్పుడో క్షమించేశానని, క్షమిస్తే శాంతి లభిస్తుందని, ప్రస్తుతానికి తన దృష్టంతా రాష్ట్రంపైనా, తన ప్రజలపైనా మాత్రమే ఉందని అన్నారు.
New Delhi
Jagan
India Today
Intervies

More Telugu News