Annvaram temple: అన్నవరం దేవస్థానంలోనూ డ్రెస్‌కోడ్.. జూలై 1 నుంచి అమలు

  • పురుషులు పంచె-కండువా.. కుర్తా-పైజమా 
  • మహిళలు చీర-జాకెట్టు, పంజాబీ డ్రెస్-చున్నీకి ఓకే
  • ఆధునిక వస్త్రధారణతో వచ్చే వారికి అనుమతి నిరాకరణ
అన్నవరం దేవస్థానంలో జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై దేవాలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆధునిక వస్త్రధారణతో వచ్చే భక్తులకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో ఎంవీ సురేశ్ బాబు తెలిపారు. ఇకపై సత్యదేవుని దర్శనానికి వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.

మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి. పిల్లలైతే లంగా-ఓణీ ధరించాల్సి ఉంటుందని సురేశ్ బాబు తెలిపారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం, వ్రతాలు, దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అని పేర్కొన్నారు. అలా రాని భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Annvaram temple
Andhra Pradesh
dress code

More Telugu News