Narendra Modi: తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న మోదీ

  • సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు
  • తల్లికి పాదాభివందనం
  • గుజరాత్ ప్రజలే తననీ స్థాయికి చేర్చారంటూ భావోద్వేగం
ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోదీ తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం  సాయంత్రం గాంధీనగర్ వచ్చిన మోదీ తల్లి హీరాబెన్‌ను కలిసి పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆమె పక్కన కూర్చుని కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు.

తల్లి హీరాబెన్‌ను కలవడానికి ముందు నర్మదా నది తీరంలోని సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తానీ స్థాయిలో ఉండడానికి కారణం గుజరాత్ ప్రజలేనంటూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
Narendra Modi
Gujarat
Heeraben
sardar patel

More Telugu News