lakshmi parvathi: నాకు పదవులపై వ్యామోహం లేదు : వైసీపీ నేత లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ హయాంలో నన్ను మంత్రిగా చేయమన్నారు
- అయినా నేను తీసుకోలేదు
- 2014లో జగన్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు
తనకు పదవులపై వ్యామోహం లేదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ మంత్రి పదవి తనను తీసుకోమని తనకు రెండు సార్లు కోరారని, అయినా తాను తీసుకోలేదని అన్నారు. అదే, ఆ రోజున మంత్రి పదవి తీసుకోనుంటే జయలలిత లా తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే దానినేమోనని అన్నారు. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ తనకు రాజ్యసభ ఎంపీ గా ఉండమని తనను కోరినా తాను తీసుకోలేదని గుర్తుచేశారు. వైసీపీలో చేరిన తనను ఓ తల్లిలా జగన్ ఆదరించారని, ఏనాడూ తనకు పదవి కావాలని ఆయన్ని అడగలేదని చెప్పారు. 2014లో తనను పోటీ చేయమన్నారు, ఆ తర్వాత ‘వద్దులేమ్మా, ఎమ్మెల్సీ ఇస్తాను’ అని జగన్ అంటే ‘సరే, బాబు’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రజలు ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొట్టారు
‘నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే, ఎన్టీఆర్ నే కాకుండా ఆ పార్టీని పతనం చేసిన, రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాడన్న హ్యాపీ నెస్ ని అనుభవిస్తున్నా’ అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. టీడీపీకి 50 లేదా 60 స్థానాలు కనుక వచ్చి ఉంటే మళ్లీ అతను (చంద్రబాబు) బతికి ఉన్నట్టేనని, ప్రజలు ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొట్టారంటూ వ్యాఖ్యానించారు.