Amethi: ఎన్నికల్లో తన తరపున ప్రచారం చేసిన కార్యకర్త పాడె మోసి అందరినీ ఆశ్చర్యపరిచిన స్మృతి ఇరానీ

  • స్మృతి తరపున సురేంద్రసింగ్ ప్రచారం
  • సురేంద్రను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
  • సురేంద్ర కుటుంబ సభ్యులను ఓదార్చిన స్మృతి
అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి అత్యంత సమీప అనుచరుడిగా ఉంటూ గత ఎన్నికల్లో సురేంద్ర సింగ్ అనే కార్యకర్త ప్రచారం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలో ఉన్న బరౌలి గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్ర సింగ్ పని చేస్తున్నాడు. అయితే అతడిని శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ బరౌలి వెళ్లి సురేంద్ర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పడమే కాకుండా అతడి పాడెను భుజానికెత్తుకుని మోసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్య పరిచారు.  


Amethi
Smruthi Irani
Surendra Singh
Baroli
Murder

More Telugu News