సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై నటి స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు
- దేశానికి మంచి రోజులు వచ్చాయి
- ఉగ్రవాద ఆరోపణలున్న వ్యక్తిని పార్లమెంటుకు పంపుతున్నాం
- ఇప్పుడిక పాకిస్థాన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్
దేశానికి మంచి రోజులు వచ్చాయని వ్యంగ్యంగా ట్వీట్ చేసిన స్వరభాస్కర్.. దేశంలో తొలిసారి ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంటుకు పంపుతున్నామని, ఇప్పుడిక పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌కు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషిల తరపున ఈ ఎన్నికల్లో స్వరభాస్కర్ ప్రచారం చేశారు. కానీ, వారందరూ పరాజయం పాలయ్యారు.