Himachal Pradesh: మానసిక రోగి పొట్ట కోసి చూసిన వైద్యులకు నమ్మశక్యం కాని వస్తువుల దర్శనం!

  • భరించలేని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
  • కడుపులో ఇనుప దుకాణం!
  • శస్త్రచికిత్స చేసిన వైద్యులు
హిమాచల్ ప్రదేశ్ లో ఓ మానసిక రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులకు అతడి ఉదరంలో దిగ్భ్రాంతి కలిగించే వస్తువులు దర్శనమిచ్చాయి. ఏకంగా ఓ ఇనుప వస్తువుల దుకాణమే కనిపించింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ప్రాంతానికి చెందిన కరణ్ సేన్ మానసిక వ్యాధిగ్రస్తుడు. అతడి వయసు 35 ఏళ్లు. అయితే, కరణ్ సేన్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు మండీలోని లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు.

వైద్య పరీక్షల అనంతరం అతడి కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రష్షులు, కిచెన్ నైఫ్ బయటికి తీశారు. మానసిక రోగి కాబట్టే తాను ఏం చేస్తున్నదీ అతడికి తెలియలేదని, అందుకే ఇనుప వస్తువులు మింగేసి ఉంటాడని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కరణ్ సేన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.
Himachal Pradesh

More Telugu News