jaganmohanreddy: అది అనుకోకుండా జరిగిన ఘటన...జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్‌

  • సమస్యలు వివరించుదామని వెళ్లాను...కంగారులో కత్తి తగిలింది
  • నేను జగన్‌ అభిమానిని
  • జగన్‌ సీఎం అవుతుండడంతో చాలా ఆనందంగా ఉంది
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ సరికొత్త కథ వినిపిస్తున్నాడు. అది కావాలని చేసిన ప్రయత్నం కాదని, సమస్యలు వివరించాలని వెళ్లి జగన్‌కు చెబుతుండగా కంగారులో కత్తి తగిలిందని చెప్పుకొచ్చాడు. జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏడునెలలుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌ ఈరోజు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను జగన్‌ అభిమానినని, అటువంటి తప్పు చేశానని నిరూపిస్తే తల నరుక్కొంటానని అన్నాడు. ఆరోజు ఘటనానంతరం అక్కడి వారు నన్ను కొడుతుంటే జగనే రక్షించారని, ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన దయేనన్నారు. అటువంటి మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
jaganmohanreddy
visakha airport
murder attempt
acused srinivas

More Telugu News