Guntur District: వైసీపీ శాసన సభాపక్షం సమావేశం ఎఫెక్ట్‌.. జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిలిచిన ట్రాఫిక్‌

  • కిలోమీటరు మేర నిలిచిపోయిన వాహనాలు
  • అక్కడే దిగి నడిచి వెళ్లిన ప్రజాప్రతినిధులు
  • ఒకేసారి రావడంతో ట్రాఫిక్ రద్దీ
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఈరోజు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వైసీపీ సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో దాదాపు ఒకే సమయంలో రావడంతో కార్యాలయం నుంచి కరకట్ట వరకు వాహనాలు నిలిచిపోయి ఈ పరిస్థితి తలెత్తింది.

కిలోమీటరు మేర వాహనాలు నిలిచి పోవడంతో సమావేశానికి ఆలస్యం అవుతుందన్న కారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడే వాహనాలు దిగిపోయి నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం 10.31 గంటలకు ఎమ్మెల్యేలతోను, 11.30 గంటలకు ఎంపీలతోను జగన్‌ సమావేశమైన విషయం తెలిసిందే.
Guntur District
tadepalli
jagan camp office
traffic

More Telugu News